Actor Vishal | ‘పందెం కోడి’, ‘భరణి’, ‘పొగరు’, ‘డిటెక్టివ్’ తదితర సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు విశాల్. పుట్టింది తెలుగు ఫ్యామిలీలో అయిన తమిళనాడులో పెరగడంతో అక్కడే హీరోగా సెటిల్ అయిపోయాడు ఈ కుర్ర హీరో. అయితే విశాల్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా ఆయన మీడియా ముందుకి రాగా.. అతడి మొహం వాచి ఉండడం.. చేతులు వణకడం చూసి అభిమానులు కంగారుపడుతున్నారు.
దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను 12 ఏండ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు విశాల్ బయటకు వచ్చాడు. అయితే ఈ వేడుకలో విశాల్‌ని చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. అతడి మోహం వాచి ఉండడం.. మాట్లాడుతుంటే ఇబ్బంది పడ్డ తీరు.. వణకడం చూసి ఏమైందని అందోళన చెందుతున్నారు.
మరోవైపు విశాల్ గత కొన్నిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. అతడు కోలుకున్న అనంతరం అభిమానులను కలుస్తాడు అని తెలిపింది. అయితే విశాల్‌ను ఇలా చూసిన అభిమానులు చలించిపోతోన్నారు. నిజంగానే జ్వరమేనా? ఏమైనా జరిగి ఉంటుందా? అని కామెంట్లు పెడుతున్నారు.
Actor #Vishal 🥹❤️
Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja …
Dedication 💪 ❤️pic.twitter.com/qb1o3vHvuh
— Movies4u Official (@Movies4u_Officl) January 5, 2025