Directors | సినిమాకి డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్. ఎంత పెద్ద హీరో సినిమాలో ఉన్నా ఆ సినిమాని తీసే విధానంలో కాస్త తడబడితే నిండా సినిమా మునిగినట్టే. అయితే ఒకప్పుడు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తెరకెక్కించిన దర్శకులు ఇప్పుడు తడబడుతున్నారు. దర్శకుడు ఏఆర్ మురగదాస్ గురించి మాట్లాడుకుంటే ఆయన చివరిగా సల్మాన్ ఖాన్‌తో సికందర్ అనే మూవీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. కొన్నాళ్లుగా ఆయనకి హిట్ అనేది రావడం లేదు. గతంలో గజినీతో తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన ‘తుపాకీ’ మూవీతో తన క్రేజ ఎంతో పెంచుకున్నారు. చిరంజీవితో ‘స్టాలిన్’, సూర్యతో ‘సెవెన్త్ సెన్స్’ సినిమాలు యావరేజ్‌గా ఆడినా మురుగదాస్ టాలెంట్ కి ఎవరు వంక పెట్టలేదు.
అయితే అప్పట్లో టాప్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన మురుగదాస్ ఇప్పుడు సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇక ఈయన మాదిరిగానే శంకర్ పరిస్థితి ఉంది. భారతీయుడు చిత్రంతో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన శంకర్ భారతదేశం గర్వించేలా సినిమాలు చేశాడు. అయితే కొన్నాళ్లుగా ఆయన పనితనం బాగోలేదు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇండియన్ 2’ చూసి ప్రేక్షకులు జడుసుకున్నారు. ఆ టేకింగ్ చూసి అసలు ఆ పాత శంకర్.. ఈ శంకర్ ఒక్కరేనా అనే అనుమానం కూడా చాలా మందికి వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేశాడు శంకర్. అయితే ఇది సూపర్ హిట్ అవుతుందిలే అని అందరు అనుకున్నారు. కాని ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినీ ప్రియులనే కాదు మెగా ఫ్యాన్స్‌ని సైతం ఏ మాత్రం మెప్పించలేకపోయింది
గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యాక శంకర్‌పై అంచనాలు అనవసరంగా పెట్టుకున్నాము అని చాలా మంది ఫీలయ్యారు. టేకింగ్ గానీ, స్క్రీన్‌ప్లే గానీ, పాటలు గానీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దీంతో చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా ‘గేమ్ ఛేంజర్’ నిలిచింది. తమిళ ఇండస్ట్రీకి ఆశాదీపంలా కనిపించిన శంకర్, మురుగదాస్‌లు ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యారు. మురుగదాస్ ఇటీవలి కాలంలో త విజయ్‌తో ‘సర్కార్’, రజినీతో ‘దర్బార్’ సినిమాలు ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. మహేష్ బాబుతో తీసిన స్పైడర్ అయితే అట్టర్ ఫ్లాప్. ఇటీవల ఈ ఇద్దరి దర్శకుల రికార్డులు చూసి తమిళ, తెలుగు హీరోలు జంకుతున్న పరిస్థితి. వారు కనిపిస్తేనే మొహం చాటేస్తే పరిస్థితి వచ్చింది. ఒక్కప్పుడు తమిళ సినీ పరిశ్రమకు దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయదం ఆవేదన కలిగిస్తుంది. ప్రస్తుతం శంకర్ చేతిలో ‘ఇండియన్ 3’, మురుగదాస్ చేతిలో శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి వీటితో అయిన సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది చూడాలి.