Gowtam Tinnanuri | జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాను మొదటగా రామ్ చరణ్‌తో తెరకెక్కిద్దాం అనుకోని పలు కారణాల వలన విజయ్ దేవరకొండతో తీశాడంటూ అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌పై నాగవంశీ కింగ్డమ్ ప్రెస్మీట్లో స్పందించాడు. రామ్ చరణ్‌కి గౌతమ్ చెప్పిన కథ కింగ్డమ్ కాదు. అది వేరే కథ. చరణ్‌తో అది ఒకే కాలేదు. దీంతో ఈ గ్యాప్‌లోనే గౌతమ్ నా దగ్గరికి వచ్చి కింగ్డమ్ కథను విజయ్‌తో తీయాలంటూ నా ముందుకు వచ్చాడు. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లిందంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుంది. సత్యదేవ్, మలయాళం నటుడు వెంకీటేశ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
“#Kingdom is not the story that Gautam wrote for #RamCharan.”
– #NagaVamsi pic.twitter.com/U6Ppq42OMN
— Movies4u Official (@Movies4u_Officl) July 30, 2025