Gangs of Godavari review | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen), నేహాశెట్టి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో రాజోలు భామ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. గోపరాజు రమణ కీలక పాత్రలో నటించారు.
ఇంతకీ కథ ఏంటంటే..?
లంకల రత్న (విశ్వక్సేన్), స్టోరీ ఇంట్రడక్షన్ తర్వాత రత్నమాలగా అంజలి ఎంట్రీ ఇస్తుంది. విశ్వక్సేన్, అంజలి మధ్య కొన్ని సన్నివేశాల తర్వాత అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇంటెన్స్ ఫైట్ సాగుతుంది. భవిష్యత్ కోసం పెద్ద ప్లాన్ వేసిన విశ్వక్సేన్ ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) టీంలో జాయిన్ అవుతాడు. అనంతరం నేహాశెట్టి ఊళ్లో గొప్ప పేరున్న నానాజీ కూతురు (నాజర్) బుజ్జిగా అందరికీ పరిచయమవుతుంది.
ఎమ్మెల్యే టైగర్ రత్నాకర్‌గా..
కొంత కామెడీ ట్రాక్ తర్వాత విశ్వక్సేన్, నేహాశెట్టి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. ఇద్దరి మధ్య ప్రేమను హైలెట్ చేస్తూ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సుట్టంలా సూసి చార్ట్ బస్టర్ సాంగ్ వస్తుంది. ఆసక్తికరంగా విశ్వక్సేన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఎమ్మెల్యే అవడంతో లంకల రత్నాకర్ కాస్తా టైగర్ రత్నాకర్‌గా మారిపోతాడు. తదనంతరం కథలో షాకింగ్ ట్విస్ట్ బయటపడటంతో పోలీస్ స్టేషన్లో ఇంటెన్స్ యాక్షన్ పార్టు.. మరో ట్విస్ట్‌తో విరామం పడుతుంది.
డార్క్, ఎక్జయిటింగ్, మాస్ ఎలిమెంట్స్‌తో విశ్వక్సేన్ మాస్ అప్పియరెన్స్ తో సాగుతుంది. అంజలి , నేహా శెట్టి పాత్రలు ఒకే అనిపించేలా ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. . మొత్తంగా ఫస్ట్ హాఫ్ బోరింగ్ లేకుండా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ చెబుతున్నాయి.
సెకండాఫ్‌లో.. ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో సాయికుమార్ గెద్దరాజుగా పరిచయం అవుతాడు. విలేజ్ చుట్టూ తిరిగే రాజకీయాలతో కూడిన సన్నివేశాలుంటాయి. విశ్వక్సేన్ కొత్త ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లు, ట్రాన్స్‌ఫార్మేషన్‌ను హైలెట్ చేస్తూ.. భవిష్యత్ బాగుండాలంటే తన ప్రవర్తన మార్చుకోవాలని నేహాశెట్టి విశ్వక్సేన్ను హెచ్చరిస్తుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత అయేషా ఖాన్‌తో మోత స్పెషల్ సాంగ్ వస్తుంది.
సాగతీతగా అనిపించే కథనం, నిదానంగా సాగే సీన్లతో ఫస్ట్ హాఫ్‌తో సెకండాఫ్ పోలిస్తే డల్‌గా అనిపించగా.. అదిరిపోయే ఫైట్స్‌లో విశ్వక్సేన్ ఊరమాస్ సంభవాన్ని చూడొచ్చని అంటున్నారు నెటిజన్లు. మరి మాస్ కా దాస్ తాజా సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది తెలియాల్సి ఉంది.
బ్యాడ్ సాంగ్..
మోత లిరికల్ సాంగ్..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..