Biggboss Season 5 Telugu | బిగ్ బాంబ్ మరిచిపోయారేంటి..ఈ సారి ఉంటుందా లేదా..?
బిగ్ బాస్ (Biggboss Season 5 Telugu) ఇంటి నుంచి ఏ కంటెస్టెంట్ అయినా కూడా బయటికి వచ్చేటప్పుడు వాళ్లకు ఓ పవర్ ఉంటుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నా..ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఓ వరం ఇస్తాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ (Biggboss Season 5 Telugu) ఇంటి నుంచి ఏ కంటెస్టెంట్ అయినా కూడా బయటికి వచ్చేటప్పుడు వాళ్లకు ఓ పవర్ ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గుర్తు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నా..ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఓ వరం ఇస్తాడు బిగ్ బాస్. తనకు కావాల్సిన వాళ్లకు ఫేవర్ చేయడానికైనా.. లేదంటే నచ్చని వాళ్లపై పగ తీర్చుకోడానికైనా బిగ్ బాంబ్ అనేది ఉంటుంది. తొలి నాలుగు సీజన్స్ లో దీన్ని చూస్తూనే ఉన్నాం. ఆ వారమంతా బాంబ్ అప్లై అవుతుంటుంది. అయితే ఎందుకో మరి బిగ్ బాస్ 5 తెలుగులో మాత్రం బిగ్ బాంబ్ గురించి నాగార్జున (Nagarjuna)తో పాటు బిగ్ బాస్ కూడా మరిచిపోయాడు.
తొలి వారం ఎలిమినేట్ అయిపోయిన సరయు (Sarayu) కు అలాంటి అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్. అది చూసి అంతా షాక్ అయిపోయారు. అదేంటి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ కు పవర్ ఉంటుంది కదా..బిగ్ బాంబ్ వేయడపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అందర్నీ తిట్టేయాలనే కసితో ఉన్న సరయు చేతికి కానీ బిగ్ బాంబ్ వచ్చుంటే కచ్చితంగా ఎవరో ఒకరు ఇంట్లో బలైపోయేవాళ్లు. అయితే ఆ సమయానికి ఎందుకో మరి బిగ్ బాస్ బాంబ్ గురించి మరిచిపోయాడు.
నిజంగానే మరిచిపోయారా లేదంటే ఈ సీజన్ లో రూల్స్ ఏమైనా మార్చారా అనేది కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతీసారి కచ్చితంగా ఉండే బిగ్ బాంబ్ ఈ సారి ఎందుకు తీసేస్తారు.. అలా తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా సస్పెన్స్. సరయు విషయంలో పొరపాటు జరిగిపోయిందా లేదంటే ఈ సీజన్ అంతా బిగ్ బాంబ్ ఉండదా అనేది వచ్చే వారం తెలుస్తుంది. ఒకవేళ మరిచిపోతే మాత్రం అది సరయు బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే. చూడాలిక.. రెండో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్కు అయినా ఆ బాంబ్ పవర్ ఇస్తారో లేదో..?
ఇవి కూడా చదవండి..
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

