RashaThadani | ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతి ఫిల్మ్స్ సమర్పణలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. తాజాగా ఈ మూవీ నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రాషా ఠడానీ (RashaThadani) టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమవుతోంది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో ఆమె ‘మంగ’ అనే పవర్ఫుల్ మరియు ఎలిగెంట్ పాత్రలో నటిస్తుండగా, దీనికి సంబంధించిన ఆమె ఫస్ట్ లుక్ ప్రస్తుతం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “కోటి మంది దేవతలు నా పక్కనుండి వెళ్తున్నా.. నేను మాత్రం నిన్నే చూస్తూ ఉంటా” అంటూ హీరో శ్రీను ఆరాధించే తీరును బట్టి, కథలో ఆమె పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో అర్థమవుతోంది.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను అశ్విని దత్ సమర్పణలో వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమా మరియు చందమామ కథలు బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జయకృష్ణ ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు రాషా ఠడానీ ఎథ్నిక్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Welcoming the stunning #RashaThadani to Tollywood! She makes her grand debut as ‘Manga’ in #SrinivasaMangapuram, directed by the visionary @DirAjayBhupathi. Her elegant ethnic look is already winning hearts!. The film features #JayaKrishnaGhattamaneni making his debut as Srinu. pic.twitter.com/3gMWXbvmO1
— The Cinema (@TheThe43289) January 30, 2026