AIR (All India Rankers) | ఈ మధ్య ఏం సినిమా తీసిన మా మనోభవాలు దెబ్బతింటున్నాయని ఒక బ్యాచ్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలలో ఇది జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా వచ్చిన ఒక వెబ్ సిరీస్ వలన నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. ఇటీవల ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ రాగా.. అందులో మా హీరోలను ట్రోల్ చేశారంటూ సోషల్ మీడియాలో చిత్రయూనిట్‌పై దాడి చేసింది నందమూరి అభిమానులు. అయితే ఈ వివాదం ముదురుతుండడంతో క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ సన్నివేశాలను తొలగించారు మేకర్స్. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటి అంటే.!
యువ నటులు హర్ష రోషన్, భాను ప్రకాశ్, జయతీర్థ ప్రధాన పాత్రధారులుగా నటించిన వెబ్ సిరీస్ ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. ఈ వెబ్ సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించగా.. సందీప్ రాజ్ నిర్మించాడు. చైతన్యరావ్, సునీల్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ వెబ్ సిరీస్ జులై 3 నుంచి స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో నందమూరి అభిమానులను ఉద్దేశించి ఒక సీన్ ఉంటుంది. ఇందులో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులం అంటూ సెటైరికల్‌గా ఒక సన్నివేశం వస్తుంది. అయితే ఈ సీన్స్ మమ్మల్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించారంటూ నందమూరి, తెలుగుదేశం అభిమానులు చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వివాదంపై నిర్మాత సందీప్ రాజ్ క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ సన్నివేశాన్ని వెబ్ సిరీస్ నుంచి తొలగించినట్లు ప్రకటించాడు. కాగా ఈ వివాదంగా మారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Director Twitter “C HOW DARE” Batch Space lu vintadu anukunta scene perfect dinchadu 😬😬 pic.twitter.com/5doKQpMpjO
— రామ్ (@ysj_45) July 5, 2025
Dear brothers,
2025 started on a greatest note for me by being part of such massive blockbuster film like Daaku Maharaj.
The love i got in the name of tweets, gave me immense confidence to do more and more beautiful work.
But now seeing the hatred from same accounts and same…— Sandeep Raj (@SandeepRaaaj) July 5, 2025
At Ramoji Group, we are committed to respecting everyone’s sentiments and avoiding any offense. All objectionable scenes in the *AIR* web series have been removed. Thank you for your continued support.
ETV Win consistently delivers high-quality and diverse content. @etvwin
— saikrishna koinni (@krishna_kri) July 5, 2025