సత్యరాజ్, వసంత్వ్రి, తాన్య హోప్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. అబ్దుల్, మన్జూర్, అజిజ్ నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సత్యరాజ్ మాట్లాడుతూ ‘పెన్, మైక్ గొప్ప ఆయుధాలు. వీటితో సమాజాన్ని ప్రేరేపించే మీడియా ఇంకా పెద్ద ఆయుధం.
ఈ నేపథ్యంలోనే సినిమా సాగుతుంది. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందని నమ్మకంగా చెప్పగలను. గుహన్ మంచి కథ రాసుకున్నాడు’ అని తెలిపారు. రెండో ప్రపంచయుద్ధాన్ని బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నాననీ, ఈ నెల 7న విడుదల కానున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అందరికీ నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.