Actor Bala : మలయాళ నటుడు బాలాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మాజీ భర్త తనను అవమానించాడని ఆయన మాజీ భార్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన మాజీ భర్త బాలా తనను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని, విడాకుల షరతులను ఉల్లంఘించాడని బాలా మాజీ భార్య అమృత సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమృత సురేష్ ఫిర్యాదు మేరకు బాలాను అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా ఎర్నాకుళం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చేందుకు తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు ఆస్పత్రి నుంచి బాలాను తీసుకెళ్తున్నప్పుడు.. తనపై తన మాజీ భార్య తప్పుడు కేసు పెట్టిందని మీడియాతో అన్నారు. తాను ఆమెను అవమానించానని చెప్పడం అసత్యమని చెప్పారు.
#WATCH | Kochi, Kerala: Malayalam actor Bala, arrested by the police on the complaint of his ex-wife Amrutha Suresh alleging that he insulted her through social media and violated divorce conditions, being taken from Ernakulam General Hospital after his medical examination. pic.twitter.com/uYXKJeQsth
— ANI (@ANI) October 14, 2024