Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’(Chhaava). ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది.
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
— Netflix India (@NetflixIndia) April 10, 2025