రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ది వారియర్. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. లింగుస్వామి దర్శకుడు. ఈ నెల 14న సినిమా విడుదల కానుం ది. ఆదివారం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ…’పోలీస్ సినిమాల్లో నటించడం కొన్ని రోజులు ఆపేద్దాం అనుకున్న సమయంలో లింగుస్వామి అలాంటి కథే తీసుకొచ్చారు. అయితే ఈ స్క్రిప్టు విన్న తర్వాత పోలీస్ కథలో నటిస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనుకున్నాను.
ఈ సినిమాలో భావోద్వేగాలు అంత బాగా కుదిరాయి. ఇందులో సత్య అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తా. సత్య లాంటి పోలీస్ అధికారులు ఎంతోమంది డిపార్ట్ మెంట్ లో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. ఈ కథ విన్నాక లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు అనే ధైర్యం కలిగింది. దర్శకుడు లింగుస్వామికి హ్యాట్సాఫ్ చెబుతున్నా. ఇది నాకు ఎమోషనల్ ఫిల్మ్. షూటింగ్ కు వెళ్లే ముందు గాయమైంది.
బరువులు ఎత్తొద్దు అని డాక్టర్ చెప్పారు. ఈ సినిమాలో యాక్షన్, డ్యాన్సు లు ఉంటాయి, నేను సిద్ధమవ్వాలి అని అడిగితే నీకు సినిమా ముఖ్యమా, జీవితమా అన్నారు. సినిమానే జీవితంగా బతికే మన లాంటి వాళ్లకు ఆ ప్రశ్న సరైందికాదు అనిపించింది. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ సినిమాలో ఇంత బాగా నటించగలిగాను’ అన్నారు. నాయిక కృతిశెట్టి మాట్లాడుతూ…’నిజం కోసం నిలబడే ప్రతి ఒక్కరూ వారియరే. మీరంతా జీవితంలో అలా నిలబడాలని కోరుకుంటున్నా. రామ్ మంచి సహ నటుడు. ఆయన ఎనర్జీ చూసే ఉస్తాద్ రాపో అని పిలుస్తుంటారని ఈ సినిమా చేశాక తెలిసింది’ అని చెప్పింది.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ…’నా తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాధించాయి. తెలుగులో నేరుగా చేసిన మొదటి చిత్రమిది. టాలీవు్డ లో అడుగుపెట్టేందుకు ఇది సరైన సినిమా. రామ్ దర్శకుల హీరో. మేము ఎలా సినిమా రూపొందించాలని అనుకుంటామో అలాగే నటిస్తాడు. కుదిరితే తనతో కనీసం ఓ పది చిత్రాలై నా తెరకెక్కించాలని ఉంది. అతని డ్యాన్స్ లు, ఫై ట్స్ ఆకట్టుకుంటాయి. మీకు వందశాతం నచ్చే సిని మా అవుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి కిషోర్, వివేక్ కూచిభొట్ల, దర్శకులు హరీశ్ శంకర్, తిరుమల కిషోర్, సమర్పకులు పవన్ కుమార్, లిరిసిస్ట్ సాహితీ తదితరులు పాల్గొన్నారు.