నైజాం ఏరియా (Naizam Area)లో వన్ అండ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ( Dil Raju).మరోవైపు ఏసియన్ సునీల్, సురేశ్ బాబు ఈ జాబితాలో ఉన్నా..వాళ్లు సినిమాలు కొనుగోలు చేయడంలో అంతగా ఆసక్తి చూపించరు. కేవలం అడ్వాన్స్ ల మీద షోలు నడిపించేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే నైజాం ఏరియాలో నేనున్నా అంటూ అప్పడపుడు వరంగల్ శ్రీను కూడా తెరపైకి వస్తుంటారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య నైజాం రైట్స్ (Warangal Srinu)ను రూ.36 కోట్లు పెట్టి మరీ దక్కించుకోగా..సినిమా బోల్తా కొట్టడంతో నష్టాలను చవిచూసినట్టు టాలీవుడ్ (Tollywood) సర్కిల్ టాక్.
కాగా వరంగల్ శ్రీను ఇపుడు మరో డేరింగ్ స్టెప్ వేశాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లైగర్ (Liger) సినిమా ఆంధ్రా, సీడెడ్, నైజాం హక్కులను రూ.70 కోట్లకు దక్కించుకున్నాడని కొందరు అంటుంటే..కాదు రూ.60 కోట్టు పెట్టాడని మరికొంతమంది అంటున్నారు. ఈ రెండింటిలో ఏదైనా భారీ మొత్తం కాబట్టి వరంగల్ శ్రీను మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టేనని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే డబ్బులు రికవరీ చేయడం సులభమే. కానీ బాడ్ టాక్ వస్తే మాత్రం మరోసారి నష్టాల బారిని పడక తప్పదు. అయితే వరంగల్ శ్రీను మాత్రం ఆంధ్రా, సీడెడ్ల రైట్స్ ను విక్రయించి నైజాం ఏరియాపై మాత్రమే ఫోకస్ పెట్టాలని సన్నాహాలు చేస్తున్నాడని, తద్వారా సేఫ్ జోన్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఏదైమైనా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఇంత మొత్తంలో వెచ్చించడం డేరింగ్ స్టెప్పనే అంటున్నారు సినీ జనాలు.