Hrithik Roshan – బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2′(War 2). ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు ఈ స్టార్ హీరోలు. అయితే తాజాగా ఈ నటులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో తన పోస్టర్‌తో ఉన్న ఒక భారీ బిల్ బోర్డ్‌ను హృతిక్ రోషన్ ఇంటికి పంపించి సవాళు “ఘుంగ్రూ టూట్ జాయేంగే పర్ హమ్సే యే వార్ జీత్ నహీ పావోగే” (గుంఘ్రూలు పగిలిపోవచ్చు, కానీ ఈ యుద్ధాన్ని మీరు మాతో గెలవలేరు) అంటూ హృతిక్‌ని సవాలు చేశాడు. దీనికి హృతిక్ సమాధానమిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి హృతిక్ పోస్టర్ ఉన్న ఒక బిల్ బోర్డ్‌ను పంపారు. ఈ బిల్ బోర్డ్‌లో మీరు ‘నాటు నాటు’ డాన్స్ ఎంత చేసినా, ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అంటూ హృతిక్ బదులిచ్చాడు. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. నైస్ రిటర్న్ గిఫ్ట్ హృతిక్ సర్ అంటూ సరధాగా సమాధానమిచ్చాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ సరదా సంభాషణ ‘వార్ 2’ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
Okay @tarak9999, now you’ve taken it too far by sending an actual BILLBOARD under my house! Alright, challenge accepted. Remember you brought this upon yourself. #9DaysToWar2 pic.twitter.com/WvjHiB3o3v
— Hrithik Roshan (@iHrithik) August 5, 2025
Nice return gift @iHrithik sir…But this is not the end! The War begins for real on 14th August. See you then! 😎#8DaysToWar2 pic.twitter.com/3P8kD2rrwy
— Jr NTR (@tarak9999) August 6, 2025