దేశంలోనే అతిపెద్ద సినిమాటిక్ ఫ్రాంచైజీలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన చిత్రం యష్‌రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆఫ్ ది ఇయర్ ‘వార్ 2’. బ్లాక్‌బస్టర్ ‘వార్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రంలో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకుడు.
కియారా అద్వానీ కథానాయిక. అగస్ట్ 14న IMAX థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు ఇంకా 50రోజులే ఉండటంతో గురువారం ఈ సినిమాకు చెందిన సరికొత్త పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీలపై విడివిడిగా రూపొందించిన ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.