Jr Ntr – Hrithik Roshan | అగ్రనటులు ఎన్.టి.ఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో హృతిక్‌తో కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ విలన్ అని అనుకున్నారు. కానీ తారక్ కూడా మంచి షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో ‘యానిమల్’ సినిమాతో సంచలనం సృష్టించిన బాబీ డియోల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇన్నిరోజులు తారక్ విలన్ అని నిరాశలో ఉన్న అతడి అభిమానులు ఈ వార్తతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.