War 2 | బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు సరికొత్త మైలురాయిగా నిలిచిన YRF స్పై యూనివర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘వార్ 2’ నేడు (ఆగస్టు 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో విడుదలైన సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన , ఎంట్రీ సీన్ , యాక్షన్ ఎపిసోడ్స్ పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్ దద్దరిల్లింది. షర్ట్‌లెస్ సీన్లో స్టన్ అవ్వక మానరు. హృతిక్ ఎంట్రీ కూడా అదే రేంజ్లో ఉంది. ఇద్దరూ స్క్రీన్‌పై విజువల్ ఫెస్ట్ అందించారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ (ఎన్టీఆర్) vs కబీర్ (హృతిక్) మధ్య సీన్స్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తున్నాయి. వీళ్ల మధ్య వచ్చే ఫైట్స్, ఛేజింగ్ సీక్వెన్సులు హాలీవుడ్ రేంజ్లో ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారట. కొన్ని సన్నివేశాల్లో హృతిక్‌ను ఎన్టీఆర్ డామినేట్ చేయగా, మరికొన్ని సన్నివేశాల్లో హృతిక్ ఆధిక్యం చూపిస్తాడట. సంచిత్ అండ్ అంకిత్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఊపు తెచ్చాయని సినీ ప్రియులు చెబుతున్నారు.
ఇంటర్వెల్ బ్లాక్ , ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ కథనాన్ని తనదైన స్టైల్లో తెరకెక్కించినట్టు అభిమానులు భావిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ ఫీల్ వచ్చింది. స్పై యాక్షన్ డ్రామా అంటే ఇదే కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కియారా అద్వాని స్క్రీన్‌పై తక్కువ సమయమే కనిపించినా, ఆమె అందం, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘సలామే’ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి చేసిన డ్యాన్స్ మాస్ ఫీస్ట్‌గా ఆకట్టుకుంటోంది. నాటు నాటు స్థాయి అయితే కాదు కానీ, ఈ డ్యాన్స్ మాస్ అండ్ క్లాస్ కలయిక అంటున్నారు ప్రేక్షకులు. సినిమాలో నిజమైన విలన్ ఎవరు? ఎన్టీఆర్ పాత్రలోని షేడ్స్ ఏంటి? అనే విషయం సినిమా చివరి వరకూ సస్పెన్స్ గా నిలిచింది. ఈ మిస్టరీ తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్ లో చూడాల్సిందే. వార్ 2లో రా ఏజెంట్ కబీర్ రోల్ చేశారు హృతిక్ రోషన్. అయితే వార్ 2లో అతడిని వలలో వేసిన పాకిస్తానీ ఏజెంట్ రోల్ కియారా చేసినట్టు సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.