War 2 Movie | బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సంచలనం ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కి ఇది సీక్వెల్‌గా వస్తోంది.
ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆగష్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే ఉందని తెలుపుతూ.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు నటుడు ఎన్టీఆర్. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. కియార అద్వానీ కథానాయికగా నటిస్తుంది.
The wait ends soon. The war begins… #30DaysToWar2#War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. @iHrithik | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/GocWLNEnSR
— Jr NTR (@tarak9999) July 16, 2025