హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న ‘వార్-2’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్‌రాజ్ ఫిలింస్ బ్లాక్బాస్టర్ ‘వార్’కి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. నవంబర్‌లో క్లైమాక్స్ ఘట్టాల చిత్రీకరణకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 30 రోజుల పాటు జరిగే ఈ షూట్లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇప్పటివరకు భారతీయ సినిమాలో చూపించని విధంగా ఇన్నోవేటివ్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారని, తొలిభాగం కంటే ఇంటెన్స్‌గా పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ ఎపిక్ ైక్లెమాక్స్ ఎపిసోడ్ కోసం కథానాయకులు హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని, స్ట్రెంత్ ట్రెయినింగ్, స్పీడ్ బేస్డ్ ఎక్సర్‌సైజ్‌లపై దృష్టి పెడుతున్నారని చిత్ర బృందం పేర్కొంది. విదేశాల్లో చిత్రీకరించే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఇండియన్ స్క్రీన్‌పై మెమొరబుల్‌గా నిలిచిపోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.