అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 13న విడుదల కానున్న ఈ చిత్రం సోమవారం సెన్సార్‌ను పూర్తిచేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పం దన వచ్చింది. అభిమానులు, ప్రేక్షకులు ఈ సిని మా కోసం ఎదురుచూస్తున్నారు. తప్పకుండా అం దరి అంచనాలకు మించి చిత్రం ఉండబోతుంది. సెన్సారు ‘యూ.ఏ’ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. సినిమా వాళ్లకు నచ్చడంతో పాటు మమ్మల్ని అభినందించడం ఆనందంగా వుంది’ అన్నారు.