Waltair Veerayya Movie On OTT | ‘వాల్తేరు వీరయ్య’తో మెగా అభిమానుల ఆకలి తీరిపోయింది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ కంబ్యాక్ ఇస్తాడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు సంక్రాంతి వేదికైంది. చిరు క్రేజ్ పడిపోయింది. ఇక చిరును ఎవరు చూడరు. ఆయన సినిమాలు మానేయాలి అంటూ విమర్శలు చేసిన వారితోనే చిరు చప్పట్లు కొట్టించాడు. వింటేజ్ చిరును చూసి అభిమానులు మురిపోయారు. మెగాస్టార్ యాక్షన్, కిక్కిచ్చే డ్యాన్సులు, విజిల్స్ వేయించే ఫైట్స్ ఇలా సినిమా మొత్తం ఒక మాస్ ప్యాకేజితో నిండిపోయింది. చిరు మాస్ యాక్షన్‌కు రవన్న క్రేజ్ తోడవడంతో బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య విజయభేరి మొగించింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫిబ్రవరి 27నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ సగం సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు.
నిజానికి ఈ సినిమాకు తొలిరోజు మిక్స్డ్టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మొదటి రోజు మొదలుకొని మూడు, నాలుగు రోజుల వరకు కూడా అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్బోర్డులు పడ్డాయి. మెగాస్టార్ కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో వాల్తేరు వీరయ్యతో రుజువైంది. పోటీగా వీరసింహా, వారసుడు, తెగింపు వంటి పెద్ద సినిమాలున్నా.. యూత్ నుండి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరూ వాల్తేరుకే ఓటేశారు.
In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB
— Netflix India South (@Netflix_INSouth) February 7, 2023