లాస్ ఏంజిల్స్: అవతార్(Avatar) ఫిల్మ్‌కు చెందిన తదుపరి సీక్వెల్స్ రిలీజ్‌ను మరింత వాయిదా వేశారు. వాల్ట్ డిస్నీ దీనిపై ప్రకటన చేసింది. జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో అవతార్ సిరీస్‌కు చెందిన రెండు భాగాలు రిలీజైన విషయం తెలిసిందే. అయితే మరో మూడు భాగాలను రిలీజ్ చేయాల్సి ఉంది. మూడు, నాలుగు, అయిదో ఇన్స్టాల్మెంట్స్కు చెందిన చిత్రాల రిలీజ్ తేదీను మరింత వాయిదా వేశారు. ఇక స్టార్ వార్స్ ఫిల్మ్ 2026లో థియేటర్లలోకి రానున్నట్లు వాల్ట్ డిస్నీ వెల్లడించింది.
హాలీవుడ్లో రైటర్లు ధర్నా చేస్తున్నారని, దాంతో మార్వెల్ చిత్రాలైన థండర్‌బోల్ట్స్, బ్లేడ్ రిలీజ్ తేదీలను వెనక్కి జరిపినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అవతార్ మిగితా మూడు సీక్వెల్స్ రిలీజ్‌ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న అంశంపై ప్రొడ్యూసర్ జాన్ లాండూ ట్విట్టర్లో వివరించారు. మూడు, నాలుగు, అయిదో సీక్వెల్ మేకింగ్ కోసం నిర్మాతలుకు మరింత సమయం కావాల్సి వస్తోందన్నారు. వాస్తవానికి డిసెంబర్ 2024లో అవతార్ 3ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ దాన్ని డిసెంబర్ 2025కు రీషెడ్యూల్ చేశారు. ఇక అవతార్ 4ను డిసెంబర్ 2029లో రిలీజ్ చేయనున్నారు. అవతార్ 5ని డిసెంబర్ 2031లో రిలీజ్ చేస్తారు.