Vyjayanthimala | ప్రముఖ నటి, నర్తకి వైజయంతిమాల మరణించారంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. ఈ వార్తలపై ఆమె కుమారుడు సుచింద్రబాలి స్పందించారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని తెలిపారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన చెప్పారు. ‘వైజయంతిమాల చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. వార్తలు ప్రసారం చేసే ముందు వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి. తప్పుడు ప్రచారాన్ని మానుకోండి’ అంటూ వైజయంతిమాల కోడలు నందిని సైతం తన సోషల్‌మీడియాలో పోస్ట్‌లో పేర్కొంది.
తమిళ ఇండస్ట్రీ ద్వారా కథానాయికగా పరిచమైన వైజయంతిమాల దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా గుర్తింపును తెచ్చుకున్నారు. దిలీప్‌కుమార్ ‘దేవదాస్’ (1955) చిత్రంలో ఆమె పోషించిన చంద్రముఖి పాత్రకు విశేషమైన ప్రాచుర్యం దక్కింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తిరుగులేని పేరుప్రఖ్యాతుల్ని సంపాదించుకుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.