వివేక్ మిశ్రా, శృతిక జంటగా రూపొందనున్న సినిమా ‘అహోం’. ప్రసాద్‌రాజు దర్శకుడు. దశరథ్ నిర్మాత. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ పానిండియా చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు వి.వి.వినాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
వాణిజ్య విలువలతో కూడిన తాజా కథతో ఈ సినిమా రూపొందనున్నదని, దర్శకుడు ప్రసాద్‌రాజు అద్భుతమైన కథను రాసుకున్నారని నిర్మాత దశరథ్ చెప్పారు. అజయ్ ఘోష్, శాండీ, కోటకొండ కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆనెం, సంగీతం: వివేక్-పునీత్, నిర్మాణం: ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్.