The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files). ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్దేవ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.