Bigg Boss | టాలీవుడ్ లవ్లీ కపుల్ వరుణ్ సందేశ్ – వితికా షేరు లైఫ్‌లో ఇటీవల వరుస సంతోషకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఈ జంట కొత్త ఇంట్లోకి అడుగు పెట్టగా, గృహప్రవేశ వేడుకను ఘనంగా జరిపారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇంతలోనే మరో గుడ్ న్యూస్‌ని అభిమానులతో పంచుకుంది వితికా షేరు. ఆమె చెల్లెలు కృతిక తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బేబీ బంప్‌తో ఉన్న కృతిక.. తన భర్త కృష్ణతో కలిసి దిగిన ఫోటోలను వితిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
2022లో వివాహం చేసుకున్న కృతిక – కృష్ణ దంపతులు, ఇప్పుడు తమ జీవితంలోని మరో మధుర ఘట్టంలోకి అడుగుపెడుతున్నారు. వితిక ఈ వార్తను అభిమానులతో పంచుకుంటూ ఎంతో భావోద్వేగంగా పోస్ట్ చేసింది. కృతిక తల్లి కాబోతుండటంతో వితిక ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఫోటోలు చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు కృతిక-కృష్ణలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వితిక – వరుణ్ లవ్ స్టోరీ విషయానికి వస్తే… వితిక బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, తరువాత హీరోయిన్గా మారింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన భర్త వరుణ్ సందేశ్‌తో ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించింది. అదే సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించగా, 2016 ఆగస్టు 19న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.
పెళ్లి తర్వాత వితిక, వరుణ్ ఇద్దరూ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. వితిక ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నా, టీవీ షోలు, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇక వరుణ్ సందేశ్ మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ ‘కానిస్టేబుల్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. అయితే వితిక కుటుంబంలోకి చేరనున్న అతిథి పట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కృతిక-కృష్ణ దంపతులపై ప్రేమను కురిపిస్తూ నెటిజన్లు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.