విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణచైతన్య దర్శకుడు. అవనింద్ర కుమార్ నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సిటీలో అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని భయంకరంగా హత్య చేస్తున్న హంతకుడెవరో పోలీసులకు అంతు పట్టదు. ఈ కేసును ఛేదించడానికి సత్య (సునీల్) అనే పోలీసాఫీసర్‌ను నియమిస్తారు. అతని పరిశోధన ఎలా సాగిందన్నది ఆసక్తిని పంచుతుంది’ అని చెప్పారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: గంగనమోని శేఖర్, ఈశ్వర్, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణచైతన్య.