విశ్వంత్, అనురూప్, విస్మయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నమో’. ఆదిత్య రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనేత క్రియేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై ఏ.ప్రశాంత్ నిర్మించారు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘సర్వైవల్ కామెడీ కథాంశమిది. ఆద్యంతం చక్కటి వినోదంతో పాటు థ్రిల్‌ను పంచుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, సంగీతం: క్రాంతి ఆచార్య వడ్లూరి, దర్శకత్వం: ఆదిత్య రెడ్డి కుందూరు.