Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరింది. ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ భారీ ఫాంటసీ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. వింటేజ్ చిరు మేజిక్‌ను మళ్లీ వెండితెరపై చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 14 లోకాల్లో హీరోయిన్ కోసం హీరో చేసే యాత్రే ఈ కథ యొక్క కేంద్ర బిందువుగా తెలుస్తుంది.
విశ్వంభర చిత్ర కథకు ప్రేరణగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘పాతాళ భైరవి’, ‘కీలు గుర్రం’చిత్రాలు నిలిచాయి. భారీ విజువల్స్, గ్రాఫిక్స్‌తో ఫుల్ స్కేల్ ఫాంటసీ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటిస్తుంది. చాలా కాలం తర్వాత చిరుతో త్రిష కలిసి పనిచేయడం అభిమానులకు ఇది మంచి సర్ప్రైజ్ కావొచ్చు. ఇక సినిమా స్పెషల్ ఎలిమెంట్‌గా బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పర్ఫార్మ్ చేయబోయే స్పెషల్ సాంగ్ కానుంది. ఈ పాట చిరంజీవి ఐకానిక్ సినిమా గ్యాంగ్ లీడర్‌లోని ఎవర్గ్రీన్ మాస్ సాంగ్ ‘రగులుతోంది మొగలిపొద’ కు రీమిక్స్ అని తెలుస్తోంది.
మౌనీ రాయ్ ‘నాగినీ’ సీరియల్, ‘బ్రహ్మాస్త్ర’ వంటి ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే మంచి ఫేమ్ సంపాదించగా, ఈ పాటతో టాలీవుడ్లో తన క్రేజ్ మరింత పెరుగుతుందన్నదాంట్లో సందేహం లేదు. తాజాగా విశ్వంభర సెట్లో చిరంజీవితో కలిసి మౌనీ రాయ్ దిగిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఈ పిక్‌తో విశ్వంభర చిత్రంలో మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేస్తుందనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ‘విశ్వంభర’ చిత్రాన్ని UV క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లకు పైగా వెచ్చించినట్టు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ విలువలు అన్ని కూడా ఆకట్టుకునేలా ఉంటాయట. ఈ చిత్రంలో ఆషికా రంగనాథన్, ఇషా చావ్లా కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండటంతో మ్యూజికల్‌గా కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.