Vishwambhara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు పాటలు, క్లైమాక్స్ షూట్ మిగిలిఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది చిత్రబృందం. అయితే ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే మేకర్స్ దసరా పండుగనాడు ఈ మూవీ టీజర్‌ను వదలబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.
#Vishwambara – Teaser – Tomorrow
— Aakashavaani (@TheAakashavaani) October 11, 2024