Vishwambhara Teaser | మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర టీజర్ వచ్చేసింది. చెప్పినట్లుగానే దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ విడుదల చేసింది.
ఈ టీజర్ చూస్తుంటే.. ‘అంజి’ వాటి సోషియో ఫాంటసీ తర్వాత మెగాస్టార్ మళ్లీ ఆ రేంజ్లో ఈ జానర్ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి మాస్ అవతార్, పవర్ఫుల్ డైలాగులు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ టీజర్ ఆద్యంతం సినీప్రియులను అలరించేలా సాగింది. టీజర్ చూస్తున్నంత సేపు వేరే ప్రపంచంలోకి వెళ్లి వచ్చామా అన్నట్లు ఉంది.
సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు పాటలు, క్లైమాక్స్ షూట్ మిగిలిఉన్నట్లు తెలిపింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.