Vishwambhara | బింబిసార చిత్రంతో బడా హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనే బాగా ఆలస్యం అవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇదే కాగా, ఈ సినిమా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
అయితే విశ్వంభర మూవీ రిలీజ్ విషయంపై అభిమానులలో గందరగోళం నెలకొంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదు జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంభర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాని ఓ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తుంది. విశ్వంభర ఇలా వాయిదాలు పడుతండడంతో మూవీ విషయంలో ఏం జరుగుతుంది అంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా అందులో వీఎఫ్ఎక్స్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్తపడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తుంది.ఇక మూవీ యూనిట్ ఇప్పుడు మంచి ప్రయత్నం చేసింది. విశ్వంభర సినిమా ‘రామ రామ’ సాంగ్ ని పెన్‌డ్రైవ్స్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి, లేదా వాళ్ళ ఇళ్లల్లో అయినా ప్లే చేయడానికి ఈ పెన్ డ్రైవ్‌ని ఇస్తున్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్‌ని కూడా రెడీ చేశారు. ఇక ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.