ఈ ఏడాది రాబోతున్న చిరంజీవి సినిమా ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఒకటి వెలుగు చూసింది. కథానుగుణంగానే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ని మేకర్స్ ప్లాన్ చేశారట. నిజానికి ఈ సినిమా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కాగా, కేవలం ఈ పాట కోసమే భీమ్స్ సిసిరోలియోని మేకర్స్ రంగంలోకి దింపారట.
ప్రస్తుతం భీమ్స్ ఈ పాటను స్వరపరిచే పనిలో ఉన్నారట. ఈ ఐటమ్‌సాంగ్‌లో చిరంజీవితోపాటు నర్తించే అదృష్టాన్ని కన్నడ నటి నిశ్వికా నాయుడు సొంతం చేసుకున్నదని సమాచారం. కన్నడ చిత్రం ‘కరటక దమనక’లో ప్రభుదేవతో కలిసి నిశ్వికా నర్తించిన ‘హితలకా కరిబయడా మావ..’ సాంగ్ తెలుగునాట కూడా ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.
ఆ పాటలో ప్రభుదేవాకు ధీటుగా డాన్స్ చేసిన నిశ్వికా.. త్వరలో మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయనుందని ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో టాక్. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.