స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో విశ్వక్సేన్ పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని కొత్త రీతిలో ఉంటుంది. మాస్, క్లాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఆయన పాత్రను తీర్చిదిద్దాం.
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్విరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, సంభాషణలు: ప్రసన్నకుమార్ బెజవాడ, నిర్మాణ సంస్థలు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్, నిర్మాత: కరాటే రాజు, దర్శకత్వం: విశ్వక్సేన్.