ఇటీవలే ‘మెకానిక్ రాకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో విశ్వక్సేన్. ప్రస్తుతం ఆయన లైనప్‌లో వరుస సినిమాలున్నాయి. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్షన్లో కూడా విశ్వక్సేన్ ఓ సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు విశ్వక్సేన్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘ఫంకీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఆద్యంతం వినోద ప్రధానంగా తెరకెక్కించే ఈ సినిమాలో విశ్వక్సేన్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని, చక్కటి హాస్యంతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేయనుందని సమాచారం. ఈ సినిమా విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం విశ్వక్సేన్ ‘లైలా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో ఆయన లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. విశ్వక్సేన్ మరో చిత్రం ‘కల్ట్’ మార్చిలో మొదలుకానుంది.