VishwakSen CULT Motion poster | టాలీవుడ్ నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ తర్వాత మంచి ఊపు మీద ఉన్న సమయంలో ‘ఫలక్‌నుమా దాస్ అంటూ వచ్చి అటు నటుడిగా ఇటు దర్శకుడిగా, నిర్మాతగా విజయం అందుకున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం మళ్లీ మెగాఫోన్ పట్టి ‘దాస్ కా ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టింది.
దర్శకుడిగా ఆయనపై విమర్శలు రావడంతో, విశ్వక్ కొంతకాలం దర్శకత్వానికి దూరంగా ఉండి తన నటనపై దృష్టి సారించాడు. అయినప్పటికీ, ఆయన నటించిన పలు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా ‘లైలా’ చిత్రంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీంతో విశ్వక్ స్వయంగా అభిమానులకు క్షమాపణ చెప్పి, ఇకపై మంచి చిత్రాలను ఎంచుకుంటానని హామీ ఇచ్చాడు.
ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫంకీ అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ‘కల్ట్’ అంటూ ఈ సినిమా రాబోతుండగా.. విశ్వక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు రైటర్‌గా పనిచేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలకాగా.. చిత్రబృందానికి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపాడు తలసాని.
Mass Ka Das #VishwakSen coming up this time with his third directorial, a wild new-age PARTY THRILLER🔥#CULT ❤️🔥❤️🔥❤️🔥
Shoot begins today with a grand pooja ceremony 💥Written and Directed by @VishwakSenActor
Produced by #TarakCinemas @VanmayeCreation #KarateRaju… pic.twitter.com/M5kdO2E7LB— BA Raju’s Team (@baraju_SuperHit) May 11, 2025