VT11 Movie | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్తో కూస్తో దూకుడు చూపిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది విశ్వక్ సేనే. ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా విశ్వక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యే ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ విడుదలైంది. తొలిరోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో వారం వరకు బాగానే లాక్కొచ్చింది. ఇటీవల ఓటీటీలో రిలీజై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో సితార బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి.
ఇటీవలే గ్రాండ్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభించింది. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో విశ్వక్ ఫోటోను షేర్ చేస్తూ ‘గంగానమ్మ జాతర మొదలైంది. ఈ సారి శివాలెత్తి పోద్ది’ అంటూ గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడతో విశ్వక్ ఇంటెన్సీవ్గా చూస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఛల్ మోహన్రంగా ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ లుక్ సరికొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార సంస్థ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
గంగానమ్మ జాతర మొదలయ్యింది … ఈ సారి శివాలెత్తిపోద్ది 😎
A massy schedule begins for our #VS11 🔥🔥 @VishwakSenActor @thisisysr #KrishnaChaitanya @NavinNooli @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/P073xtM69B
— Sithara Entertainments (@SitharaEnts) May 13, 2023