Mechanic Rocky | విశ్వక్సేన్ అప్‌కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నది. మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్స్‌కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తున్నదని, మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా విందు భోజనంలా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఆదివారం ఈ సినిమా డబ్బింగ్ విశ్వక్సేన్తో మొదలైంది. అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో మీనాక్షిచౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు. నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘురామ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్.