కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకొని ముందుకుసాగుతున్నారు యువహీరో విశ్వక్సేన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘స్టూడెంట్’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ‘సవారీ’ చిత్రాన్ని రూపొందించిన సాహిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
కాలేజ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, సమకాలీన అంశాల చర్చ కూడా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే ‘ఓరి దేవుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశ్వక్సేన్. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ‘స్టూడెంట్’ చిత్రం పట్టాలెక్కనుందని తెలిసింది.