విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నిర్మాతలు దిల్ రాజు, వెంకట్ బోయనపల్లి, రామ్ ఆచంట, సాహు గారపాటి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్‌నిచ్చారు. మే రెండో వారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ…‘90 దశకం నేపథ్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. కొత్త తరహా జానర్లో సినిమా ఉంటుంది. ప్రతిభ గల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : అనిత్ మధాది, సంగీతం : యువన్ శంకర్ రాజా.