Vishwak Sen Laila Movie | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలను వదిలిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను వదిలింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. లేడిస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోన్ (విశ్వక్) అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే మర్డర్ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే మనుషులు అతడి దొరికితే చంపుదామని చంపేద్దామని ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన ప్రాణలు రక్షించుకోవడానికి లైలా అనే లేడి గెటప్‌లోకి మారతాడు విశ్వక్. అయితే లేడీ గెటప్‌లో మారిన విశ్వక్‌కి ఎదురైన సంఘటనలు ఏంటి.. ఎమ్మెల్యే మర్డర్ కేసుకి లైలాకి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో నింపేశారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి.