Vishwak Sen | యువ హీరో విశ్వక్సేన్ తాజా చిత్రానికి ‘ఫంకీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్’ ఉపశీర్షిక. కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ క్లాప్‌నివ్వగా, కల్యాణ్ శంకర్ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు కేవీ అనుదీప్ శైలి వినోదం, వ్యంగ్యంతో చక్కటి కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా మెప్పిస్తుందని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని మేకర్స్ తెలిపారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ సారంగం, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ.