Vishwak sen | ఫలక్‌నుమా దాస్ సినిమాతో హీరోగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యువ నటుడు విశ్వక్సేన్ (Vishwak sen). ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన మార్క్‌ను మిస్సవకుండా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది ధమ్ కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్సేన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడన్న వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. విశ్వక్సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సంవత్సరాల కాలంగా నాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతు అందిస్తున్న నా అభిమానులందరికి, శ్రేయోభిలాషులకు నేను ఎప్పటికీ కృతజ్జుడిని. నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా. ఫ్యామిలీ ప్రయాణాన్ని మొదలుపెడుతున్నా. ఆగస్టు 15న వివరాలు తెలియజేస్తానని పోస్ట్‌లో రాసుకొచ్చాడు విశ్వక్సేన్. దీంతో విశ్వక్సేన్ పెండ్లి (Marriage) పీటలెక్కడం దాదాఫు ఫైనల్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేసినట్టేనని తెలిసిపోతుంది. అయితే కొత్త ఫ్యామిలీ అంటే సినిమా గురించే అయి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. కొంపదీసి నివేదా పేతురాజ్ (Nivetha pethuraj)ను మా వదిన చేయట్లేదు కదా.. అన్నా అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
మరి ఆగస్టు 15న వివరాలు తెలియజేస్తానని చెప్పిన విశ్వక్ సేన్.. నెటిజన్లు అనుకుంటున్నట్టుగా కొత్త సినిమా కోసమే ఇలా క్యూరియాసిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడా..? లేదంటే నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా..? అనేది మరో రెండు రోజులు ఆగితే క్లారిటీ రానుంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్సేన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). విశ్వక్సేన్ మరోవైపు ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11 (VS 11)వ సినిమా కూడా చేస్తున్నాడు. దీంతోపాటు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు.