దాడి చేయకండని వేడుకుంటున్న పాగల్ హీరో

థియేటర్స్‌లో మళ్లీ సందడి మొదలైంది. ప్రతి వారం ఐదారు సినిమాలు థియేటర్స్‌లో విడుదల అవుతుండగా, ఏదో ఒక సినిమా మంచి హిట్ కొడుతుంది. ఈ వారం పాగల్ సినిమా అలరించింది. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన ‘పాగల్’ చిత్రం ఆగస్ట్ 14న విడుదలైంది. . ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.
తాజాగా విశ్వక్ సేన్ ..ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ విమర్శకులకు ఓ సందేశం ఇచ్చాడు. ఓ లెటర్లో .. ‘నేను మీ విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ‘పాగల్’ సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి.
కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధి కలిగించే.. సినిమా థియేటర్స్‌ను కాపాడండి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..’ అని పేర్కొన్నాడు విశ్వక్ సేన్. కాగా, పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పలు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ అతడు వ్యాఖ్యలు చేయగా, ఆయనపై పలువురు విమర్శలు చేశారు. అయితే సినిమా తొలి కాపీ చూసి, ఆ మాటలు అన్నానని, అప్పుడు మాట్లాడిన ఏ మాటనీ నేను వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదు అని విశ్వక్ కామెంట్ చేశారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- critics
- pagal
- Vishwak sen
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

