Vishwak Sen | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇతనిని చూస్తే యాటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. పలు వివాదాలలో కూడా విశ్వక్ యాటిట్యూడ్ చూపించాడు అని కొందరు చెప్పుకొస్తుంటారు. అయితే మంచి టాలెంట్ ఉన్న విశ్వక్ సేన్ ఎందుకో సూపర్ హిట్స్ అందుకోలేకపోతున్నాడు. చివరిగా ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు. అయిన ఫలితం మారలేదు. ఈ సారి మాత్రం గట్టి హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు.
లైలా సినిమా ఫెయిల్యూర్ తర్వాత విశ్వక్ సేన్ పెద్దగా కనిపించింది లేదు. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హజరై అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. హిట్ ఫ్రాంచైజీ ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించిన నేపథ్యంలో హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆహ్వానించారు. ఆయన్ను సుమ సరదాగా ఇంటరాగేషన్ చేశారు. ఆఫీసర్‌నే ఇంటరాగేషన్ చేస్తారా? అంటూ సుమను ప్రశ్నించాడు విశ్వక్.. ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా.. అని సుమ అనడంతో దీనికి ‘మా తెలంగాణ బ్రాంచ్‌లో నేనే కదా ఆఫీసర్‌ను’ అని విశ్వక్ సరదాగా కామెంట్ చేశారు.
‘అర్జున్ సర్కార్, విక్రమ్‌లో లేని క్వాలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు.’ అన్న ప్రశ్నకు విశ్వక్.. ‘ఫిట్టింగ్ ఇది. ఇద్దరిలో ఉండే ప్రశాంతత. కామ్ నెస్ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ మధ్యే నా వయస్సు 30కి చేరుకుందని , ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించి కూల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఊరికే అటు ఇటు పరిగెడుతూ ఉన్నా.. ఇప్పటి నుంచి అది తగ్గిపోతుందని అని చెప్పారు. నాని, అడివి శేష్ నుంచి కూల్ గా ఉండటం నేర్చుకుంటున్నాను అని చెప్పారు. ఇక మీరు పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?’ అని సుమ అడగ్గా.. మా అమ్మకు సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. సో.. ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకుంటాను అని విశ్వక్ చెప్పడంతో త్వరలో మనోడు కూడా పప్పు అన్నం పెట్టించబోతున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.