Ashoka vanamlo arjuna kalyanam teaser | ఈనగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్ వంటి సినిమాలతో సీరియస్ పాత్రలలో కనిపించిన విశ్వక్సేన్ ఈ సారి పూర్తి భిన్నంగా వినోదాత్మక సినిమాలో నటిస్తున్నాడు.ఈయన హీరోగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జునకళ్యాణం. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో SVCC డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు,సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు పదులు దాటినా ఇంకా పెళ్లికాని అర్జున్ పాత్రలో విశ్వక్సేన్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదలచేసిన ప్రచార చిత్రాలు,ఇంట్రడక్షన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.
అరే ఇంటర్‌క్యాస్ట్ అరేంజ్ మ్యారేజ్ సినిమాల్లోనైనా అయితదారా నీకే ఫస్టా..అంటూ మొదలైన టీజర్ అద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకు మీరెన్ని సంబంధాలు చూశారు అని ఒక అమ్మాయి అడుగగా…బదులుగా విశ్వక్ సేన్ లెక్కపెట్టలేదు అంటూ సమాదానం చెప్పాడు. పెద్ద నంబరే అంటూ ఆ అమ్మాయి హాస్యాన్ని పండిస్తుంది.గోదావరి అల్లుడు గారు పెళ్లికి ముందే పిల్ల చుట్టూ తిరుగుతూ ఎయ్..ఎయ్.. అంటూ టీజర్ నవ్వులు పూయిస్తుంది. ఇక టీజర్ చివర్లో ఛి దీనమ్మ తాగీతే గాని మా బతుకులకు ఏడుపురాదు ..తాగీనోడి ఏడుపుకెమో వాల్యూ లేదు. అంటూ విశ్వక్సేన్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.కృష్ణార్జున యుద్దం ఫేం రుక్సర్ థిల్లాన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.