విష్ణు విశాల్ నటించి, శుభ్ర, ఆర్యన్ రమేశ్ లతో కలిసి నిర్మించిన మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్.కె దర్శకుడు. సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానున్నది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ సినిమా నవంబర్ 7కి వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘రవితేజ ‘మాస్ జాతర’, రాజమౌళి ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రాలు వస్తున్న తరుణంలో మా సినిమా విడుదల చేయడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నాం. వారం ఆలస్యంగా విడుదలైనా ‘ఆర్యన్’ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.’ అని ప్రకటనలో విష్ణు విశాల్ తెలిపారు. శ్రేష్ఠ్ మూవీస్ సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.