Vishnu Vishal | విజయ్, రజనీ వివాదం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై విష్ణు విశాల్ ఫైర్!
CMVijay | సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే నిరాధారమైన వార్తలు, ట్రోలింగ్‌పై కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rajinikanth | సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే నిరాధారమైన వార్తలు, ట్రోలింగ్‌పై కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రజనీకాంత్ బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పలేదనే నెపంతో విజయ్ ఎదుగుదలను చూసి తలైవా ఓర్వలేకపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు.
తన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ-2’ ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన విష్ణు విశాల్, రజనీకాంత్ విజయ్‌పై అసూయపడుతున్నారనే వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. సినీ ప్రముఖులు నాలుగైదు రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉంటే వారిపై రకరకాల ఊహాగానాలు అల్లేస్తున్నారని, రజనీకాంత్ విషయంలోనూ అదే జరిగిందని ఆయన మండిపడ్డారు. ఆయన మౌనాన్ని తప్పుగా చిత్రీకరించి చివరకు ఆయనే స్వయంగా మైక్ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునేలా చేశారని, ఇది చాలా బాధాకరమని విష్ణు విశాల్ అన్నారు. దశాబ్దాలుగా భారతీయ సినిమాలో అగ్ర నటుడిగా కొనసాగుతూ, సాధించిన విజయాలు, అందుకున్న గౌరవం సామాన్యమైనవి కావని, అలాంటి లెజెండరీ నటుడికి వేరొకరిపై అసూయ ఉంటుందని అనడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. సినిమా రంగంలో ఉండే వృత్తిపరమైన పోటీని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చి చూడవద్దని విష్ణు విశాల్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఈ వివాదంపై స్పందించిన రజనీకాంత్ కూడా “విజయ్ సీఎం అయితే నాకు ఎందుకు అసూయ ఉంటుంది? ప్రస్తుతం నేను ఏం మాట్లాడినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వివాదాలు సృష్టిస్తున్నారు” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

