విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ శుభ్ర, ఆర్యన్, రమేష్‌లతో కలిసి నిర్మిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె. దర్శకుడు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్నది. హీరో నితిన్ తండ్రి, ప్రముఖ పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు.
ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని మేకర్స్ చెబుతున్నారు. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: హరీష్ కన్నన్, సంగీతం: జిబ్రాన్, నిర్మాణం: విష్ణు విశాల్ స్టూడియోస్.