మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రచ్చగా మారాయో మనం అందరం చూశాం.ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ రచ్చ చేశారు. ఇప్పటికీ ఆ గొడవలు కొనసాగుతున్నాయి అని కొందరి మాట. అయితే మా ఎన్నికల వలన మెగా ఫ్యామిలీకి మంచు విష్ణు ఫ్యామిలీకి మధ్య దూరంగా పెరిగిందని ఇన్సైడ్ టాక్. ఇటీవల జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్‌పై మంచు విష్ణు,పవన్ ఎడమొఖం పెడమొఖంతో ఉన్నట్టు కనిపించడంతో ఆ అనుమానాలు మరింత రెట్టింపు అయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విష్ణు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ కింద జరిగింది ఇది అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో స్టేజ్ ఎక్కేముందు విష్ణు, పవన్‌లు ఎంతో ఆప్యాయంగా పలకరించుకొని ఆత్మీయంగా హగ్‌లు ఇచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య చాలా సేపు సంభాషణ జరిగింది. దీంతో.. పవన్, విష్ణుల మధ్య మాటలు లేవు అని జరుగుతోన్న ప్రచారానికి ఈ వీడియోతో చెక్ పడినట్లు అయ్యింది. రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ.. పవన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అన్నాడు. అంతే కాకుండా ఆయనేమీ చిన్న స్టార్ కాదు.. చాలా పెద్దస్టార్.. ఆయన సహాయ సహకారాలు కూడా మాకు కావాలి అని మంచు విష్ణు అన్నాడు. అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇది మన తల్లి.. జాగ్రత్తగా చూసుకో అని అన్నారంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
What really went down 😎. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021