Vishnu Priya | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే అడుగుపెట్టి, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, షోలు, యాడ్స్ చేస్తూ ప్రస్తుతం బిజీగా మారిన ఆమె… తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన ఘట్టాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసింది. విష్ణు ప్రియ మాట్లాడుతూ తన తల్లి అనారోగ్యం సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు తనను పూర్తిగా కుదిపేశాయని తెలిపింది. తన తల్లి ఆరోగ్యం క్షీణించే వరకు హాస్పిటల్‌కు వెళ్లలేదని, చివరకు తన బలవంతంపై హాస్పిటల్లో చేర్పించానని చెప్పింది.
డాక్టర్లు మూడు రోజుల్లో చనిపోతుందని చెప్పినా, ఆమె తల్లి ఏడాది పాటు బ్రతికిందని వెల్లడించింది. అయితే ఆ సమయంలో హాస్పిటల్ బిల్లులు లక్షల్లోకి చేరడంతో తాను పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయానని చెప్పుకొచ్చింది. నా దగ్గర ఉన్న డబ్బంతా బిల్లులు కట్టాను. ఇంకా చాలా కట్టాల్సి ఉంది. ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు ఇండస్ట్రీలో నాకు చాలా దగ్గరగా ఉన్న వేణు స్వామికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఒక్క క్షణం ఆలోచించకుండా నాకు కావలసినంత డబ్బు పంపించి మా అమ్మను కాపాడారు అని విష్ణు ప్రియ భావోద్వేగంగా చెప్పింది.
వేణు స్వామి గురించి కొందరు నెగటివ్‌గా మాట్లాడినా, ఆయన ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా విష్ణు ప్రియ స్పష్టం చేసింది. అయితే అంతటి సాయం చేసినప్పటికీ తన తల్లి ఏడాది కంటే ఎక్కువ బ్రతకలేదని, ఆమె మరణం తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లానని చెప్పింది. “దేవుడు నన్ను తీసుకెళ్లి మా అమ్మను ఉంచి ఉంటే బాగుండేదని చాలాసార్లు కోరుకున్నాను” అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. విష్ణు ప్రియ ఈ విషయాలను బయటపెట్టడంతో నెటిజన్లు, అభిమానులు ధైర్యం చెబుతున్నారు. ఆమె ధైర్యంగా ముందుకు సాగాలని, జీవితంలో సవాళ్లని ఎదుర్కోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.